టాలీవుడ్ నటుడు గోపీచంద్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా జయం, వర్షం లాంటి సినిమాలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. అలానే యజ్ఞం, రణం, లక్ష్యం, సాహసం, లౌక్యం లాంటి సినిమాలలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్స్‌లో చివరికి సున్నా రావడం అనేది ఒక సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ గోపీచంద్ కి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో గోపీచంద్ ఆ సెంటిమెంట్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నాడు.
ఇటీవల గోపీచంద్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్ అవడంతో ఆయన పాత సెంటిమెంట్‌ని ఉపయోగిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. గోపీచంద్ ఇప్పుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న రామాబాణం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ రామబాణం సినిమా చివర్లో సున్నా ఉండడంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాడట గోపీచంద్. మరి నిజంగానే ఈ సున్నా సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా లేదా అనేది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.
ఇకపోతే గోపీచంద్ నటించిన ఒంటరి, వాంటెడ్, జిల్, ఆక్సిజన్, చాణక్య, ఆరడుగుల బుల్లెట్ లాంటి సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దానికి కారణం సినిమాల టైటిల్ చివరన సున్నా లేకపోవడమే అని అనుకుంటున్నారు గోపీచంద్. మరి ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘రామబాణం’ టైటిల్ చివర సున్నా ఉంది కాబట్టి ఆయన సెంటిమెంట్ నిజమవుతుందా లేదా చూడాలి.