తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలేకు మరో 72 గంటలకు సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు ఈ సీజన్ ఫైనల్ విన్నర్ ఎవరో అనే ప్రశ్న అందరిలో హట్ టాపిక్‌గా మారిందిది. సోషల్ మీడియాలో మాత్రం ఈ సీజన్ విన్నర్ రేవంత్ అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్‌లు పెడుతున్నారు. అయితే గూగుల్‌లో నిన్నటి వరకు రోహిత్ విన్నర్ అని చూపించగా ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు సంబంధించిన సమాచారం అంతా మారిపోయింది.
గూగుల్‌లో విన్నర్ టు బి అనౌన్స్ అని చూపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో జరిగే చాలా సన్నివేశాలు టెలికాస్ట్ చేయరనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఫుటేజ్‌ను మొత్తం చూపించకపోవడంం వల్ల ప్రేక్షకులలో కంటెస్టెంట్ల విషయంలో భిన్నభిప్రాయాలు వస్తున్నాయి.. ఎవరిని గెలిపించాలి అనుకుంటే బిగ్ బాస్ వాళ్ళనే పాజిటివ్ గా చూపిస్తున్నారని ఈ సీజన్లో బాగా బిగ్ బాస్ నిర్వహకులపై విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు తాజాగా ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా షాపింగ్ కామెంట్లు చేసింది.
ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో చెక్కరలు కొడుతున్నా రేవంత్ పై ఆమె చేసిన కామెంట్లు ఎప్పుడు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్‌లో రేవంత్ చేసిన దారుణాలు చూపించడం లేదని సుల్తానా వాపోయింది. రెవంత్ నా గొంతు పట్టుకున్నాడు అంటూ ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.
రేవంత్ వల్ల నాకు చాలా ఇబ్బందులు వచ్చాయని నా ఫేస్ మీద కనిపిస్తున్న గాయాలకు కూడా రేవంత్ కారణం అంటూ ఆమె ఆరోపించింది. వీటికి సంబంధించిన ఫుటేజ్ ప్రసారమై ఉంటే రేవంత్ విజేతగా నిలిచేవాడు కాదని మరికొందరు సుల్తానా మాటలకు సపోర్ట్ చేస్తున్నారు. వీటితో పాటు రేవంత్ నన్ను ఎత్తి నేలకేసి కొట్టాడు, కాళ్లు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు అంటూ ఇనయా సుల్తానా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే ఇనయా చేసినన వ్యాఖ్యలపై రేవంత్ అభిమానులు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. రేవంత్‌ను కావాలనే బ్యాడ్ చేయడానికిి ఇనయా సుల్తానా ఈ కామెంట్లు చేస్తుందంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇనయా అన్న వ్యాఖ్యలు బిగ్ బాస్ నిర్వాహకులపై మరిన్ని అనుమానాలు వచ్చేలా చేస్తున్నాయి. ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.