ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ మొదలుపెట్టిన అల్లు అర్జున్. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలాగైనా వచ్చే దసరాకి కంప్లీట్ చేసి 2023 క్రిస్మస్ కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
ఇప్పుడు ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అగ్ర దర్శకుల పేర్లు బయటకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కెరలు కొడుతుంది. బన్నీ తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన గీత ఆర్ట్స్ లోనే ఈ సినిమా చేయాలనుకుంటున్నారట బన్నీ.
పుష్ప సినిమా కన్నా ముందే వీరిద్దరి కాంబినేషన్లో అలా వైకుంఠపురం సినిమా వచ్చి బన్నికి సెన్సేషనల్ హిట్ ఇచ్చింది. మళ్లీ అదే హిట్‌ను రిపీట్ చేయాలని బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఓకే చేసినట్టు టాక్ వినిపిస్తుంది. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ ఏ హీరో తో సినిమా చేస్తారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కొరటాల కన్నా ముందే ఎన్టీఆర్ త్రివిక్రంతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు కానీ అనుకోని కారణాలు వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఎన్టీఆర్ కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు.
దీంతో త్రివిక్రమ్ తో చేసే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే బన్నీ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయబోతున్నాడని కన్ఫర్మ్ అయినట్టు అటు టాలీవుడ్ వర్గాల లోను, సోషల్ మీడియాలోనూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.