ప్ర‌తి జిల్లాపై జ‌గ‌న్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్ప‌టిక‌ప్ప డు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను ఒక యూనిట్‌గా రాజ‌కీయం చేసింది.

సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల‌ను కూడా అభివృద్ది చేయాల‌నే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మం లోనే ఆయా ప్రాంతాల్లో రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీనికి సంబంధించి.. ఇప్ప‌టి కే ఆయా ప్రాంతాల్లో జ‌న‌సమీక‌ర‌ణ‌లు చేసి.. వారిలో ప్రాంతీయ వాదాన్ని బ‌లంగా ప్ర‌బ‌లేగా చేసింది.మ‌రో వైపు.. ఇప్ప‌టికే ఉన్న 13 జిల్లాను 26 జిల్లాలుగా విభ‌జించింది. దీనిద్వారా.. ప్ర‌తిప‌క్షాల‌కు ప్ర‌చారం చేసుకునేలా.. ఉన్న అవ‌కాశం త‌గ్గించింద‌నే చెప్పాలి.

అంతేకాదు.. మూడు ప్రాంతాల్లోనూ రాజ‌ధాని ఏర్పాటు ప్ర‌క‌ట‌న ద్వారా.. ప్ర‌తిప‌క్షాల‌ను దాదాపు డిఫెన్స్‌లో ప‌డేసింది వైసీపీ. ఇక‌, ఇప్పుడు మ‌రింత వ్యూహాత్మ‌కంగా ముందుకు అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా.. ప్ర‌తి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అడుగులు వేయాల‌ని భావిస్తోంది. ఒక్కొక్క జిల్లాలో భారీ నుంచి చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం.. ఆయా జిల్లాల్లో స్థానికంగా 75 శాతం ఉద్యోగాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తాజాగా సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఇది పైకి చెబుతున్నట్టు అభివృద్ధి మంత్ర‌మే కాదు.. దీనివెనుక రాజ‌కీయ తంత్రం కూడా ఉంద‌ని అంటు న్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌కీయంగా ఇది ప్ర‌భావం ఎక్కువ‌గా చూపిస్తుంది. ప్ర‌తి జిల్లాలోనూ ఉపాధి చూపించ‌డం ద్వారా ఆయా వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయ‌డంలో ఇది కీల‌కంగా మార‌నుంది. ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాల‌కు నోరు పెగ‌ల‌కుండా చేయాల‌నేది వైసీపీ ప‌క్కా స్కెచ్‌గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ వ్యూహాల‌కు ప్ర‌తిప‌క్షాలు ఎలాంటి ప్ర‌తివ్యూహాలు వేస్తాయో చూడాలి.