టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటున్న బండ్ల మొదట కమెడియన్ గా తరువాత తరువాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించాడు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణులు వచ్చినా బండ్ల వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన బండ్ల మూడవ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో నిర్మించాడు.
బాద్షా అనే టైటిల్ తో రిలీజైన ఆ సినిమా వసూళ్లను బాగానే రాబట్టింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తో టెంపర్ అనే సినిమాను కూడా బండ్ల తీసి హిట్ కొట్టాడు. ఇక అసలు విషయానికొస్తే ఎన్టీఆర్ సినిమాకు తన లుక్‌ను మార్చుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో డిఫరెంట్ లుక్‌తో అట్రాక్ట్ చేశారు ఈ నందమూరి అందగాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న సినిమా కోసం మరోసారి కొత్త తరహా గెటప్‌లోకి మారారు. ఇందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై తాజాగా నిర్మాత బండ్ల గణేష్ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.
బండ్ల తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ షేర్ చేస్తూ… లుక్ సూపర్ గా వుంది. అయితే ఈ లుక్ ‘బాద్షా’ లుక్ లాగా వుంది! అని పోల్చారు బండ్ల గణేష్. బండ్లన్న చేసిన ఈ ట్వీట్, నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ తో మరో సినిమా చెయ్ బండ్లన్న అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కొత్త రూపు రేఖలు చూసి నందమూరి అభిమానులు అయితే తెగ ముచ్చట పడిపోతున్నారు. గడ్డంతో కొంచెం బాద్షా తరహా గెటప్‌లో కెవ్వు కేక అనిపిస్తున్నారు ఎన్టీఆర్.