ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలకు ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలు తమ ఖాతాలో వేసుకుని డీలా పడుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరోకు అతని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. తారక్ టెంపర్ సినిమా దగ్గర నుంచి తాను చేసే ప్రతి సినిమాకు ఏం మాత్రం పొంతన లేకుండా కథలను ఎంచుకుంటున్న విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
ఎన్టీఆర్ సినిమా విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ విడుదలైన తొలి వారంలోనే భారీ స్థాయిలో కలెక్షను రాబడుతున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ కు ఇతర భాషల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ సక్సెస్ తో ఎన్టీఆర్ మార్కెట్ భారీ స్థాయిలో పెరిగింది. ఎన్టీఆర్ టెంపర్ సినిమా దగ్గర నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు వరుసగా ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తను తర్వాత చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకుని ట్రిపుల్ హ్యాట్రిక్ సాధిస్తారని అభిమానులు నమ్ముతున్నారు.
ఎన్టీఆర్ తన 31వ సినిమాని కొరటాల శివ డైరెక్షన్లో నటిస్తున్నాడు ఇక తర్వాత చేయబోయే తన 31వ సినిమాని స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించబోతున్నాడు. తన 32వ సినిమా గురించి కూడా త్వరలోనే క్లారిటీ రానుందని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా తొమ్మిది విజయాలు సొంతం చేసుకుంటే ఎన్టీఆర్ సాధించే ఈ రికార్డు టాలీవుడ్ లోనే రేర్ రికార్డుగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. రాబోయే సినిమాలు కూడా హిట్ సినిమాలుగా చేసుకుని టాలీవుడ్ లోనే తన పేరును మారుమ్రోగేలా చేస్తాడని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.