నందమూరి అభిమానులకు అసలు పండుగ రాబోతుంది. అఖండ సినిమాతో అదిరిపోయి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక ఆ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్ కూడా అదిరిపోయే జోష్ వచ్చింది. ఇక ఎప్పుడూ ఆ ఫ్యాన్స్ కు మరింత హైప్స్ కు తీసుకువెళ్లే ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వైరల్ గా మారింది. అఖండ విజయం తర్వాత కొద్ది గ్యాప్ లోనే మరో భారీ యాక్షన్ సినిమాను పట్టాలెక్కించాడు బాలకృష్ణ. యాక్షన్ సినిమాలను ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించే దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 108వ సినిమా అయినా వీర సింహారెడ్డిలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు దర్శకుడు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వరూపం చూపించబోతున్నారన వార్తతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రీసెంట్గా ఈ సినిమా టైటిల్‌ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయగా… సినిమాలో వింటేజ్ బాలయ్యను చూడబోతున్నారంటూ హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమా కథ విషయంలో కూడా బాలయ్య అభిమానులకు పూనకాలే అన్నది లేటెస్ట్ అప్డేట్. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తన విశ్వరూపం చూపించబోతున్నారంటూ ఈ సినిమా మేకర్స్ ఊరిస్తూన్నారు.
అనంతపురం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న వీర సింహారెడ్డి సినిమాలో ఏకంగా 11 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పక్కా బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండబోతున్నాయట. మామూలుగా బాలకృష్ణ సినిమాలు అంటే యాక్షన్ సన్నివేశాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు ఈ సినిమాలోని నెవర్ బిఫోర్ అనే విధంగా ఉంటాయని సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో.. ఈ సినిమా మీద అభిమానులకు మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.