చిరంజీవి శోభనం గదిలో బాలకృష్ణ.. అసలు విషయం తెలిస్తే షాక్ అయిపోతారు..!

తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ నలుగురు సీనియర్ హీరోలు సినిమాల విషయంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ వీరి కుటుంబాల మధ్య కాదు. ఈ నలుగురు సీనియర్ హీరోలు ఒకే కుటుంబంల వారి స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు ఈ నలుగురు హీరోలకు సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు బయటకు వస్తూ ఉంటాయి. చిరంజీవి- బాలకృష్ణ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఎప్పుడు కలుసుకోకపోయినా ఏ ఫంక్షన్ లో కనిపించినా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ కనిపిస్తారు.

Balakrishna, Chiranjeevi come face-to-face on talk show

ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఓ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటో ఏంటో తెలుసా..! చిరంజీవి శోభనం గదిలో పెళ్లి కొడుకు గెట‌ప్‌లో కూర్చుని ఉంటే అతని పక్కన బాలకృష్ణ సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసా? చిరంజీవి హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఘరానా మొగుడు ఒకటి. ఈ సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించాడు.

ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బాలకృష్ణ వచ్చాడు. ముహూర్తపు షాట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వల్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశానికి తగ్గట్టు చిరు శోభనం పెళ్ళికొడుకు గెటప్ లో రెడీ అయ్యాడు. ఆ సన్నివేశానికి మొదటి క్లాప్ కొట్టిన బాలకృష్ణ తరవాత అక్కడ ఉన్న మంచం మీద బాలకృష్ణ- చిరంజీవి కూర్చుని ఏదో సీరియస్ గా డిస్కషన్ పెట్టినట్టు ఆ ఫోటోలో కనిపిస్తుంది. ఇది ఈ ఫోటో వెనుక ఉన్న అస్సలు కధ..!!

Share post:

Latest