ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి సనన్ గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. మరొకవైపు వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా భారీ పాపులారిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంద్రధనస్సు లాంటి రంగురంగుల చీర ధరించి చీరకట్టులో కూడా టెంప్ట్ చేస్తోందని చెప్పాలి.
ఉప్పొంగే ఎద అందాలతో బ్యాక్ లెస్ వీపు చూపిస్తూ మరింతగా హోయలు పోతుంది ఈ ముద్దుగుమ్మ. చీర కట్టులో కూడా అందాలు ఆరబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అంతలా తన అందాలతో మరింతగా పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. తెలుగు ఆడియన్స్ను ఇప్పటికే బాగా పరిచయం చేసుకున్న ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వన్ నేనొక్కడినే సినిమాతో అలరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ సరసన హిందూ మైథాలజికల్ ఫిలిం ఆదిపురుష్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది. సీతారాముల పాత్రలో ప్రభాస్ ,కృతి సనన్ ఆకట్టుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే వచ్చే ఏడాది జూన్ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన కృతి సనన్ జంటగా నటించినా భేదియా సినిమా తెలుగులో తోడేలు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ సినిమా నవంబర్ 25వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె ఇలా రకరకాల దుస్తులతో అందరినీ ఆకట్టుకుంటోంది.