ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ నయనతారను వివాహం చేసుకున్న తర్వాత మరింతగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెలలో నయనతార బర్తడే చేసుకోబోతోంది.. పెళ్లి తర్వాత అది కూడా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులైన తర్వాత చేసుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో నయనతార బర్తడేను చాలా స్పెషల్ గా ప్లాన్ చేయబోతున్నాడట విగ్నేష్ శివన్. అంతేకాదు ఇప్పటివరకు ఏ భర్త కూడా తన భార్య కోసం చేయని పనిని విగ్నేష్ చేస్తున్నాడు అని తెలిసి అభిమానులు కూడా షాక్ లో ఉండిపోయారు. ఇంతకు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈమె ప్లేస్ ఎవరు కూడా ఆక్యుపై చేయలేరని చెప్పడంలో సందేహం లేదు. క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకపక్క ఫిజిక్ మెయింటైన్ చేయడంతో పాటు కెరియర్ను కూడా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే.. తనకంటే చిన్నవాడైన దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.
ప్రస్తుతం ఈమె 18వ తేదీన తన పుట్టినరోజు చదువుకోబోతున్న నేపథ్యంలో ఈమె బర్తడే ఎలా సెలబ్రేట్ చేస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఐదేళ్లు ఆమె పుట్టినరోజును విగ్నేష్ శివన్ చాలా స్పెషల్గా గ్రాండ్గా ప్లాన్ చేసేవాడు. మరి ఇప్పుడు పెళ్లి , పిల్లలు తన జీవితంలోకి వచ్చేసారు. అందులోనూ ఈ 18 కి నయనతారకు 38 సంవత్సరాలు పూర్తవుతాయి. అందుకే స్పెషల్ గా ఉండాలని తన భార్య పుట్టిన రోజు జీవితంలోనే గుర్తిండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడట విగ్నేష్ . అయితే ఏం చేయబోతున్నాడు అనేది ప్రస్తుతం సస్పెన్షన్ లోనే ఉంది. మరి విగ్నేష్ ఎంత గ్రాండ్ గా ఏర్పాటు చేస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.