ఒకవైపు బాధ.. మరోవైపు ఆనందం… శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్..!!

ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటుంది అందాల ముద్దుగుమ్మ శృతిహాసన్. ఈమె తాజాగా నటిస్తున్న హాలీవుడ్ సినిమా దిఐ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం శృతిహాసన్ అక్కడికి వెళ్ళింది. ఇక అక్క‌డ నుంచి సోషాల్‌ మీడియాలో తను హోమ్‌ సిక్‌ ఫీలవుతున్నాను అంటూ వెల్లడించింది. ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే తెరకెక్కిస్తున్నాడు.

Indulge 14th Anniversary Special: Shruti Haasan is back from her sabbatical  and how!

సోషల్ మీడియాలో శృతిహాసన్ ఈ విధంగా మాట్లాడుతూ..”నా కెరియర్‌లో లభించిన అరుదైన అవకాశం ఈ సినిమా. ఎంతో మంచి చిత్రంలో నటిస్తున్నాననే సంతోషంగా ఒకవైపు ఉన్న”… “ఇంటిని నా వాళ్ళని మిస్‌ అవుతున్నాననే బాధ వస్తుంది. మా ఇంట్లో ఉండే శంతను, అతని వేసిన పెయింటింగ్స్, నా పెట్స్‌ను చూడలేకపోతున్నాను అనే బాధ మరోవైపు”… “నేను ఎంతగానో ప్రేమించే కళా రంగంలో లభిస్తున్న అవకాశాలు పట్ల ఆనందంగా ఉన్న… ఎందరో గొప్ప వారితో కలిసి నటిస్తున్నాను అన్న నా లైఫ్ లో సంతోషం ప్రేమకు కొదవలేదు.. అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది”. ఈ ముదుగుమ్మ ప్ర‌స్తుతం తెలుగులో చిరంజీవి- బాలకృష్ణ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలు సంక్రాంతి కనుక ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

Share post:

Latest