మొదట టాలీవుడ్లోకి లవ్లీ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శాన్వి శ్రీవాత్సవ. వారణాసిలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ లేడీ డైరెక్టర్ విజయ దర్శకత్వంలో వచ్చిన లవ్లీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీంతో ఈమె పేరు లవ్లీ హీరోయిన్ గా పేరు పడిపోయింది. ఈ చిత్రం తురువతా సుశాంత్ హీరోగా వచ్చిన అడ్డా సినిమాతో ఈ ముద్దుగుమ్మ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అడ్డా సినిమా తర్వాత శాన్వి శ్రీవాత్సవ తెలుగు సినీ పరిశ్రమంలో పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.
ఇక తర్వాత కనడ ఇండస్ట్రీలోకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం ఎంట్రీ ఇవ్వగా.. కన్నడలో చంద్రలేఖ సినిమాలో మొదటిసారిగా నటించింది. ఇక ఆ తర్వాత తెలుగులో మంచు విష్ణు హీరోగా వర్మ దర్శకత్వంలో రౌడీ అనే సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ అందచందాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాము. అలాగే మంచు విష్ణు సోదరుడైన మంచు మనోజ్ తో ప్యార్ మే పడిపోయానే అనే చిత్రంలో నటించిన ప్రేక్షకులకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్న శాన్వి కెరియర్ కేవలం నాలుగైదు సినిమాలలోని తెలుగు ఇండస్ట్రీని వదిలిపోయేలా చేసింది.
అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇప్పటివరకు 13 సినిమాలలో కన్నడలో నటించగ అందులో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఒక మలయాళం సినిమాల సైతం ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులు తిరస్కరించిన శాన్వి శ్రీవాత్సవని కన్నడ అభిమానులు మాత్రం స్టార్ హీరోయిన్ హోదా లో కుచ్చి పెట్టారు. ఇక 2019లో ఈ ముద్దుగుమ్మ మోస్ట్ డిజైనబుల్ ఉమెన్ గా 20 స్థానంలో నిలిచింది.