ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది.
తాజాగా `ఎన్టీఆర్ 30` కి టైటిల్ లాక్ చేశారంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రానికి `దేవర` అనే టైటిల్‌ను చిత్ర టీం పరిశీలిస్తుందట దాదాపు అదే టైటిట్‌ను కన్ఫామ్ చేస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఈ టైటిల్ ను బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం రిజిస్టర్ చేయించాడట.
పవన్ తో సినిమా చేస్తే ఆ టైటిల్‌తోనే చేయాలని గట్టి ప్రణాళికతో ఉన్నాడు. కానీ `దేవర` టైటిల్ ను ఛాంబర్ లో రెన్యువల్ చేయించడం మర్చిపోయాడట. దాంతో `ఎన్టీఆర్ 30`కి ఆ టైటిల్ ను లాక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారట. మొత్తానికి పవన్ కోసం బండ్ల గణేష్ `దేవర` టైటిల్ ని దాచుకుంటే ఎన్టీఆర్ 30 కోసం దోచేశారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.