మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఇటీవలే పాన్ ఇండియా సినిమా `త్రిబుల్ ఆర్` జపాన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడిపిన రామ్ చరణ్.. తర్వాత భార్య ఉపాసనతో కలిసి తాజాగా ఓ షార్ట్ వెకేషన్ ప్లాన్ చేశాడు.
ఆఫ్రికా అడవుల్లో ఎంచక్కా వైల్డ్‌లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ.. సఫారీలో ఆ ప్రాంతమంతా సరదాగా తిరుగుతున్న సమయంలో గడిపిన కొన్ని మధుర క్షణాలను ఫోటోల రూపంలో బంధించారు. రామ్ చరణ్ సఫారీ రన్నింగ్ లో ఉండగానే ఫోటోలకు ఫోజులిచ్చాడు పైగా అక్కడి వర్కర్లతో కలిసి కుకింగ్‌లో సాయం కూడా చేశాడు.
ప్రస్తుతం ఈ సూపర్ కపుల్ మెగా పిక్స్ కొన్ని నెట్టింట వైరల్ గా మారాయి. టాంజానియా లోని అందమైన ప్రదేశంలో ఆహ్లాదకరంగా గడుపుతూ.. చరణ్ హ్యట్ మరియు గాగుల్స్ తో కౌబాయ్ లా కనిపించాడు. ఉపాసన కూడా భర్తకు తగ్గట్టు స్టైలిష్ లుక్ లో మెరిసిపోయింది. ఇక వీరిద్దరూ క్యూట్ కపుల్స్ అలాగే చూడ ముచ్చటైన జంట అంటూ అభిమానులు, నెెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.