ఏ సినీ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్నారంటే చాలు ఇక అధిక మొత్తంలో ఆస్తులను సంపాదిస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ భారీగానే సంపాదిస్తూ ఉంటారు నటీనటులు. ఈ క్రమంలోనే ఈ సంపాదన మొత్తాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పలు వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. మరికొంతమంది నిర్మాతలుగా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ ఉంటారు. బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తన కూతురు జాన్వి కపూర్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.
బోనీ కపూర్ నిర్మాతగా కొనసాగుతున్న ఆమె కుమార్తె నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈ విధంగా తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి ఇండస్ట్రీలో భారీగానే లాభాలను అందుకుంటూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బోని కపూర్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.ప్రస్తుతం జాన్వి కపూర్ కూడా ఒక్కో సినిమాకి రూ.5 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది. దీంతో ఏడాదికి రూ.30 కోట్లకు పైగా సంపాదిస్తూ ఉంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా పలు బ్రాండ్లకు కూడా ప్రమోట్ చేస్తూ భారీగానే సంపాదిస్తూ ఉంది.
ఇలా ఆమె సంపాదించిన మొత్తం తో గడిచిన ఆరు నెలల క్రితం రూ.40 కోట్ల రూపాయలతో ఒక అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ విషయం మరొక ముందే తన తండ్రి సోదరి ఖుషి కపూర్ తో కలిసి మరొక రూ.65 కోట్ల రూపాయల పెట్టి ఒక డూప్లెక్స్ హౌస్ ని కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ కు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ లావాదేవీల పైన రూ.3.90 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా అక్టోబర్ 12వ తేదీన రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి కూతురైనప్పటికీ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందేమో చూడాలి.