ఎన్టీఆర్ కొరటాల సినిమాలో.. ఆ బాలీవుడ్ అగ్ర నిర్మాత కూతురు ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది రెండో సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే అంశం ఎంతో సస్పెన్స్ గా మారింది. ఇప్పుడు మొత్తానికి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడినట్టు తెలుస్తుంది.

Janhvi Kapoor to star opposite Jr NTR making her Tollywood debut? Details  inside!

ఈ సినిమాలో హీరోయిన్గా ఎప్పటి నుంచో ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని ఆశపడుతున్న అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించిన అంశంపై అతి త్వరలోనే అధికార ప్రకటన రానుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా యువ సుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

Share post:

Latest