గూస్ బంప్స్ వ‌చ్చే న్యూస్‌… ఒకే వేదిక మీద‌కు బాల‌య్య – చిరు… ఎక్కడ.. ఎందుకు తెలిస్తే షాక్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలు బాలకృష్ణ- చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్లో పండగ వాతావరణం వస్తుంది. కానీ ఒకేసారి వీరి సినిమాలు పోటీపడుతున్నాయి.. అదే సంక్రాంతి బరిలో వస్తున్నాయి. అంటే ఇది ఇండస్ట్రీని షేక్ చేసే విషయమే. ఇప్పటికే వీరి అభిమానులు సై అంటే సై అంటూ.. మా హీరో గొప్ప అంటూ మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో వార్‌ మొదలుపెట్టారు.

Unstoppable With NBK: BVS Ravi Interesting Comments on Chiranjeevi Episode With Nandamuri Balakrishna - Sakshi

ఇద్ద‌రి సినిమాల్లో ఏ సినిమా హిట్ అయిన ప్లాప్ అయిన నిర్మాతలకు మాత్రం లాభమే.. ఒకవేళ రెండు సినిమాలు హిట్ అయితే నిర్మాతలకు కాసుల వర్షం కురిసినట్టే.. ఈ సందర్భంగా ఓ కొత్త చర్చ మొదలైంది.. ఇద్దరి సీనియర్ హీరోలు.. ఒక్కచోటికి వస్తే ఏం జరుగుతుంది..? మరి ఆ వేదిక ఎక్కడ..చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య.. గాడ్ ఫాదర్ తో హిట్ అందుకున్న చిరంజీవి తర్వాత చేస్తున్న సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌ఫెక్టేష‌న్లు ఉన్నాయి.

Waltair Veerayya Tittle Teaser : Megastar As 'Waltheru Veerayya'..Mega 154 Title Teaser..Chiranjeevi In ​​Mass Ka Bop Look

దసరా పండుగకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ తో మరింత ఎక్స్పెక్టేషన్ లు పెంచేసాయి. అందులో చిరంజీవి లుక్‌తో ఆయన పాత సినిమా రోజులని గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు.. ముఠామేస్త్రి సినిమాలో కనిపించిన విధంగా ఈ సినిమాలో చిరంజీవి కనిపించడంతో ఆయన మళ్లీ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తారని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి 154వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

Veera Simha Reddy'గా నందమూరి నటసింహం.. ఇప్పటి నుంచి పూనకాలే.. | Veera Simha Reddy Official Trailer | NBK 107 Balakrishna ...

నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ‘అఖండ ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత చేస్తున్న తన 107వ సినిమా వీరసింహారెడ్డి మీద కూడా అభిమానులలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ , గ్లింప్స్‌తో అభిమానులో బాలకృష్ణ అంచనాలను పెంచేశాడు. ఇమేజ్‌కు తగ్గట్టు పక్క మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థకు ఒక ఆలోచన వ‌చ్చింది.

Titles of Chiranjeevi, and Balakrishna films to be announced shortly - JSWTV.TV

ఈ రెండు సినిమాల ప్రమోషన్లను ఒకే వేదిక మీద చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న ‘అన్ స్టాపబుల్ 2 వేదికను ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే బాలయ్య ఆ షో తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా కొందరు యువ హీరోలు తమ సినిమా ప్రమోషన్ల కోసం బాలయ్య షో కు వస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ‘అన్ స్టాపబుల్ 2 షో కు వస్తే ఈ రెండు సినిమాలకు ఒకేసారి ప్రమోషన్ చేసినట్టు అవుతుందని.. మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ అగ్ర హీరోలు ఇద్దరినీ ఒకే వేదిక మీద చూస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Share post:

Latest