ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మరో బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్ధమైన యంగ్ టైగర్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకుని అందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాని టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది.

ఈ సినిమా కన్నా ముందే ఎన్టీఆర్ తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అతి త్వరలో ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించబోతున్నాడు. ప్రముఖ ఫుడ్ బ్రాండింగ్ సంస్థ లిషియస్ సంస్థత‌కు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం కుదుర్చుకున్న ఎన్టీఆర్. ఈ సంస్థకు సంబంధించిన యాడ్ లో ఎన్టీఆర్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే బ్లస్టర్ ఎంట్రీ కోసం సిద్ధం అవ్వండి అంటూ బ్లాక్ కలర్ బ్రాండెడ్ స్టైల్ సూట్ లో ఉన్న బ్యాక్ సైడ్ పిక్ ని కొద్దిసేపటి క్రితమే ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు లిషియస్ సంస్థ వారు. దానితో తమ అభిమాన హీరో యాడ్ ని చూసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Licious (@licious_foods)