చిత్తూరులో అభ్యర్ధి కోసం తిప్పలు..టీడీపీకే మైనస్..?

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని అనుకుంటున్న టీడీపీకి..ఇంకా కొన్ని స్థానాల్లో సరైన అభ్యర్ధులు లేకపోవడం ఆ పార్టీ శ్రేణులని కలవరపెడుతున్న విషయం. గత ఎన్నికల్లో ఓడిపోయాక చాలా చోట్ల అభ్యర్ధులని పెట్టుకుని వచ్చారు..కొన్ని చోట్ల అభ్యర్ధులని మార్చారు. అయితే మూడున్నర ఏళ్ళు అయినా ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు లేకపోవడం టీడీపీకి మింగుడు పడని విషయం.

అది కూడా అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. ముఖ్యంగా చిత్తూరు అసెంబ్లీలో. గత ఎన్నికల్లో ఏ‌ఎస్ మనోహర్ పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత పార్టీ వదిలి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇంచార్జ్‌ని పెట్టలేదు..ఇప్పటికీ మూడున్నర ఏళ్ళు అయ్యాయి..మరి కొన్ని నెలల్లో ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. దీంతో చిత్తూరు అసెంబ్లీలో టీడీపీ క్యాడర్ టెన్షన్ లో ఉంది.

వాస్తవానికి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులుకు ఇప్పుడు పెద్దగా పాజిటివ్ లేదు..గత ఎన్నికల్లో జంగాలపల్లి కోసం పనిచేసిన వారు కాస్త యాంటీ అయ్యారు. అయినా సరే జంగాలపల్లి మళ్ళీ గెలుపుపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి కారణం టీడీపీ సరిగ్గా లేకపోవడమే. ఈ సీటు కోసం చాలామంది నేతలు ట్రై చేస్తున్నారు..అయిన సరే ఒకరిని ఇంచార్జ్ గా పెట్టే విషయంలో బాబు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ సీటు కోసం పులివర్తి నాని, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురుజాల మహదేవ సందీప్‌, అటు బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలతలు సైతం చిత్తూరు సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు..టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారని, లేదా ఆదికేశవులు నాయుడు ఫ్యామిలీ నుంచి ఎవరోకరికి సీటు దక్కుతుందని ప్రచారం ఉంది. కానీ ఇంతమంది ఉన్నా సరే బాబు ఎవరికి సీటు ఇవ్వాలనే కన్ఫ్యూజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సీకే బాబు గాని టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తే కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి చిత్తూరు బరిలో ఎవరు ఉంటారో.