సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల హీరో అని ఎందుకంటారో తెలుసా?

అలనాటి తెలుగు తెర అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో చర్చించుకుందాము. ముఖ్యంగా హీరో కృష్ణని అందరూ నిర్మాతల హీరో అని అంటూ ఉండేవారు. అలా ఎందుకు అనేవారో ఇపుడు తెలుసుకుందాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

1964కు ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణ 1964-65లో హీరోగా తొలి సినిమా తేనెమనసులు నటించాడు. ఇక ఆయన ముచ్చటగా మూడవసారి చేసిన, గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఆయనికి ఎంతగానో సహకరించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కృష్ణ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు.

ఇన్నేళ్ల అతని సినీ జీవితంలో నిర్మాతలు ఆయన్ని బంగారు బాతుగా పరిగణించేవారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ.. మంచి నటుడు మాత్రమే కాదు, నిర్మాతల పాలిట కల్పవృక్షం కూడా. ఒక్కోసారి సినిమాగాని ఫెయిల్ అయితే నిర్మాతల దగ్గర డబ్బులు కూడా తీసుకునేవాడు కాదట. ఒక్కోసారి సినిమా బావుందంటే వారిని పిలిచి మరీ పార్టీలు ఇచ్చేవారట. అంతేకాకుండా సినిమా ఏయే ఏరియాల్లో ఎలా ఆడుతుందని అడిగేవారట. బయట నిర్మాతలు సినిమాలు చేసినా, తన సొంత సినిమాలాగే చేసేవారట. ఒక్కోసారి నిర్మాతలు ఆయనికి డబ్బులు ఇవ్వకపోయినా అతను పట్టించుకొనేవారు కాదట. అందుకే హీరో కృష్ణ గారు నిర్మాతల హీరో అని పేరు వచ్చింది..

Share post:

Latest