బాలీవుడ్ హాట్ భామ ఉర్ఫీ జావేద్ తన దుస్తుల విషయంలో ఎప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు పొట్టి దుస్తులు ధరించి గ్రామర్ షో చేస్తూ ఉంటారు. అయితే వారందరికీీ భిన్నంగా ఈ ముద్దుగుమ్మ వస్త్రధారణ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లకు వాడే హాట్ డ్రస్సులను ఈ ముద్దుగుమ్మ బయట వేసుకుని తిరగడంతో సాధారణ జనాలు ఈమె వస్త్రధారణపై మండిపడ్డారు.
ఇక ఇప్పుడు తాజాగా ఉర్ఫీ జావేద్ వస్త్రధారణ గురించి ఓ వ్యక్తి సంచలన కామెంట్లు చేశాడు. ఆ వ్యక్తి నువ్వు మరోసారి ఇలాంటి దుస్తుల్లో కనిపిస్తే మాత్రం నిన్ను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ కు పోస్ట్ పెట్టాడు. ఇక ఇలా ఆమె వస్త్రధారణ గురించి అతను మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ పోస్ట్ పై ఉరిఫీ జావిద్ మాట్లాడుతూ తనని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి నాకు తెలుసు అని.. గతంలో కూడా నాతో ఎంతో మంచిగా ఉన్నటువంటి అతనికి నేను సహాయం చేయకపోవడం వలనే అతను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ ఈ ముద్దుగుమ్మ కామెంట్ చేసింది.
అయినా ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి. వేసుకోకూడదు అనేది నా సొంత నిర్ణయం చెప్పడానికి మీరు ఎవరు అంటూ తన గురించి వచ్చిన అటువంటి కామెంట్లపై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారియి.