బిగ్ షాకింగ్: కొడాలి నానిను ఎన్టీఆర్ దూరం పెట్టడానికి కారణం ఇదే… అంత పని చేశాడా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనతో స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్టీఆర్ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానితో విడిపోయారని తెలుస్తుంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఒక పెద్ద మిస్టరీ లాగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ మాట్లాడుకోవటం లేదని కూడా తెలుస్తుంది. ఎన్టీఆర్ సినీ కెరియర్ మొద‌లు అవ్వ‌క‌ నుంచే కొడాలి నాని ఎన్టీఆర్ తో మంచి స్నేహంగా ఉండేవాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక అయ‌న సినిమా నిర్మాణంలో కొడాలి కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు వీరి స్నేహం విడిపోవడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది స్టార్ట్ దర్శకుడు వినాయక్ బయటపెట్టాడు.

రీసెంట్ గా వి.వి వినాయక్ ఇంటర్వ్యూలో ఆయనన మాట్లాడుతూ…” ఎన్టీఆర్ కోడలి నాని చాలా మంచి స్నేహితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిణామాల ముక్క చిత్రం ఒక్కసారిగా మారిపోవడంతో వారిద్దరు విడిపోయారు. నాని వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతకుముందు వరకు వీరిద్దరు అన్ని విషయాలలో అన్ని కార్యక్రమాల్లో కలిసి వెళ్లేవారు. పార్టీలు కుటుంబ పరమైన వ్యవహారాలు వారి మధ్య మరింత దూరాన్ని పెంచాయి.

నాని వైసీపీలో చేరిన అప్పటినుంచి ఎన్టీఆర్ అతనితో తన అనుబంధాన్ని తెగ‌దెంపులు చేసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఎన్టీఆర్ చాలా కంఫర్ట్ గా ఉంటారు అతను ఒకరితో స్నేహం చేశాడంటే వదిలిపెట్టడు. ఈ క్రమంలోనే ఆయనకి ఎవరితో ఎలా మాట్లాడాలో… ఎవరిని ఎక్కడ హద్దుల్లో ఉంచుకోవాలో బాగా తెలుసు..” అని వినాయక్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో వీరిద్దరూ మల్లి కలుస్తారా అంటే.. ఏమో ఏం అవుతుందేమో అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest