అలాంటి వాళ్లకి పగిలిపోయే ఆన్సర్..పొలిటికల్ రీఎంట్రీపై చిరు మార్క్ ట్విస్ట్ అద్దిరిపోలా..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకుని చాలాకాలం అవుతుంది. కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్టుకు వస్తారని అందరూ భావించారు. ఇక చిరంజీవి కూడా పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా కామెంట్లు కూడా చేశారు.

Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్  చేసేశారు.. | Pawan kalyan responds on chiranjeevi to join in jana sena  party | TV9 Telugu

దాంతో చిరంజీవి రాజకీయాలకు వస్తారని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ వార్తలన్నిటికీ సమాధానం చెప్పే విధంగా చిరంజీవి నిన్న జరిగిన 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ముగింపు వేడుకలలో పాల్గొన్న ఆయన ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర కామెంట్లు చేశాడు.

53rd IFFI 2022: Chiranjeevi honoured with Indian Film Personality of the  Year 2022

ఆ కార్యక్రమాంలో చిరంజీవి మాట్లాడుతూ ‘గతంలో నిర్వహించిన చలనచిత్రోత్సవంలో దక్షిణాదికి సంబంధించిన ఒక నటుడు ఫోటో కూడా ఉండేది కాదని అప్పట్లో తాను ఈ విషయంపై చాలా బాధపడ్డాను, ఇప్పుడు అదే వేదికపై నేను ఈ అవార్డును అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది’. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. ‘ఇక నేను ఈ క్షణం కోసం కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూశాను. నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కార‌ణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులే కారణమని ఆయన వ్యాఖ్యానించారు’. నేను ఈ స్థాయికి వచ్చేందుకు సహ‌క‌రించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

IFFI 2022: Megastar Chiranjeevi conferred with the Indian Film Personality  award - Watch Video

ఈ క్రమంలోనే చిరంజీవి రాజకీయాలపై కూడా స్పందించాడు. ‘గతంలో నేను రాజకీయాల్లోకి వెళ్ళటం ద్వారా సినిమాలకు కొంతకాలం దూరమయ్యాను. అప్పుడే నాకు సినిమాల విలువ ఏంటో తెలిసి వచ్చింది. ఏ పరిశ్రమలోనైనా అవినీతి ఉంటుంది. ఒక చిత్ర పరిశ్రమలో మాత్రమే అవినీతి ఉండదు’. ‘ఇక్కడ ప్రతిభ ఉన్నవారు కచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చు దానికి ఉదాహరణ చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. తాను మళ్ళీ సినిమాలలోకి వచ్చే సమయంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే కొంచెం భయం ఉండేది’.

Chiranjeevi - Chiranjeevi honoured with the Indian Film Personality of the  Year 2022 award at 53rd IFFI - Telegraph India

‘మళ్లీ సినిమాల్లోకి వచ్చాక తనపై ప్రేమను ఎప్పటిలాగే చూపిస్తున్నారు వారి ప్రేమకు నేను దాసుడుని అని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సినిమాలు నుండి బయటకు వెళ్ళనని చిరంజీవి చెప్పాడు. ప్రస్తుతం సినిమాల మధ్య ప్రాంతీయ విభేదాలు లేవు ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది’. ప్రస్తుతం ఉన్న యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక దీంతో చిరంజీవి రాజకీయ రీఎంట్రీపై వస్తున్న వార్తలకి చిరు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.