రాజకీయాల్లోకి మెగా కోడలు ఉపాసన.. చిరంజీవి సంచలన ప్రకటన..?

టాలీవుడ్ లో మెగాస్టార్ కుటుంబానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి టాలీవుడ్ లో స్టార్ హీరోగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత సినిమాలలోకి వచ్చిన వారు కూడా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి సినిమాలు విజయం సాధించినట్టు రాజకీయాలలో ఆయన సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అప్పుడు నుంచి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టి రాజకీయాలలో క్రియాశీలకంగా మారాడు . ఆయన 2019లో జరిగిన ఎలక్షన్లలో ఒక సీటు కూడా గెలవలేకపోయారు. పవన్ కళ్యాణ్ గెలవకపోయినా ప్రస్తుతం తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

Chiranjeevi and Pawan Kalyan face off again?

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మరికొద్ది గంట‌ల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. సినిమా టైలర్లో చిరంజీవి ఒక డైలాగ్ చెప్పాడు.. ఆ డైలాగ్ ఏమిటంటే రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు. అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలుసు. ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాలలో హిట్ పుట్టించింది. ఈ డైలాగ్ చిరంజీవి పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుందని మనం అనుకోవచ్చు.. ఎందుకంటే చిరంజీవి రాజకీయాలకు దూరమై దాదాపు 10 సంవత్సరాలు పైనే అయింది.. అయ‌న‌ రాజకీయాలకు దూరమై ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఆయన గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటాది.

Ram Charan reveals if he is more afraid of father Chiranjeevi or wife Upasana - Hindustan Times

ఇటీవల టాలీవుడ్ లో టిక్కెట్ రేట్‌లు విషయంలో వచ్చిన సంక్షోభాన్ని చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ను కలిసి స్వయంగా ఆయన ఈ సమస్యను పరిష్కరించాడు. ఆ టైంలో చిరంజీవి వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు చిరంజీవి స్వయంగా స్పందించి అలాంటిదేమీ లేదని ఆయన చెప్పుకోవాల్సినంత పని అయింది. ఇప్పటికి కూడా చిరంజీవి బీజేపీలో- జనసేనలో చెరబోతున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలన్నీ పక్కన పెడితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.

 ఊహాగానాలుపై స్పందించిన చిరు

చిరంజీవి కొడలు రామ్ చరణ్ భార్య ఉపాసన రాజకీయాల్లోకి వస్తుందంటూ తెలంగాణలో టిఆర్ఎస్ నుంచి మల్కాజిగిరి స్థానం నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే నిన్న జరిగిన గాడ్ ఫాదర్ సినిమా ప్రెస్ మీట్ లో.. ఒక విలేకరి చిరంజీవిని ఈ విషయం గురించి అడగక చిరంజీవి తనదైన స్టైల్ లో అవిలేఖరికి ఆన్సర్ ఇచ్చాడు. చిరు మాట్లాడుతూ అలాంటి వార్తలు రాసేవారు ఎవరో కానీ అద్భుతంగా రాస్తున్నారు.. వారికి మంచి టాలెంట్ ఉంది.. సినిమాల్లోకి వస్తే బాగా పైకి వస్తారంటూ చిరంజీవి తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు.