unstoppable 2: ఎవరు ఊహించని రికార్డ్.. దట్ ఈజ్ బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హీరోగా వరుస‌ సినిమాలు చేస్తూనే.. ఆహాలో అన్ స్టాపబుల్ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోకి సంబంధించిన రెండవ సీజన్ చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ సీజన్ కి మొదటి అతిథిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అల్లుడు లోకేష్ ముఖ్య అతిథులుగా మొదటి షో కి వచ్చారు.

UnStoppable 2: అదిరిందయ్యా.. బాలయ్య!! - NTV Telugu

ఈ షోలో బాలకృష్ణ చంద్రబాబు మధ్య జరిగిన సంభాషణలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఎపిసోడ్ గత శుక్రవారం నాడు ఆహాలో స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ ఎపిసోడ్ కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఈ ఎపిసోడ్ కి ఇప్పటివరకు 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

ఇది కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్ని వ్యూస్ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది అస్సలు సిసలైన బాలయ్య మాస్ పవర్ అని చెప్పాలి. బాల‌కృష్ణ‌ చేసే ఈ టాక్ షోకి సోషల్ మీడియాలో రోజు రోజుకి విపరీతమైన క్రేజ్ వస్తుంది. రాబోయే ఎపిసోడ్లో టాలీవుడ్ కి సంబంధించిన స్టార్ హీరోలు సైతం ఈ టాక్ షోలో పాల్గొంటారని తెలుస్తుంది.