మహేష్ ‘అతిథి’కి 15 ఏళ్లు.. ఈ మూవీ గురించి ఎవరికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మే `అతిథి`. ఇందులో అమృతా రావు హీరోయిన్‌గా న‌టిస్తే.. మురళీ శర్మ, ఆశీష్ విద్యార్ధి, నాజర్, మలైకా అరోరా,నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మ‌హేష్ బాబు అన్న దివంగత నటుడు జి.రమేష్ బాబు స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే ఈ సినిమా తాజాగా విడుద‌లై 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అతిథి గురించి ఎవ‌రికీ తెలియ‌ని కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఈ సినిమా 2007వ సంవత్సరం అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ అయింది. వరుసహిట్లతో దూసుకుపోతున్న మహేష్ బాబు.. `సైనికుడు` సినిమా షాక్ ఇవ్వడంతో ఈ సినిమా పైనే అభిమానులు తమ ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కూడా వారికి నిరాశనే మిగిల్చింది. అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి మొట్టమొదట అశోక్ మరియు అతిధి కథలను ఎన్టీఆర్ కు వినిపించాడట. ఎన్టీఆర్ `అశోక్` సినిమాను సెలెక్ట్ చేసుకోగా మహేష్ బాబుకి ఈ కథ బాగా సెట్ అవుతుందని ఎన్టీఆర్ సురేందర్ రెడ్డికి సలహా ఇచ్చాడట. ఇక కథ విన్న మహేష్ బాబు ఓకే చెప్పడం జరిగింది.

 

అయితే సురేందర్ రెడ్డి కథ విషయంలో వక్కంతం వంశీతో కొన్ని మార్పులు చేర్పులు చేయించాడట. అయితే ఈ సినిమాకు హీరోయిన్గా మొదట నయనతార, చార్మిలను అనుకున్నారట కానీ, వాళ్లు డేట్స్ కుదరకపోవడంతో టాలీవుడ్ భామ అయిన అమృత రావుని సెలెక్ట్ చేశారట. అయితే ఆ రోజుల్లోనే అమృతారావు భారీగా 60 లక్షలు రెమ్యూనేషన్ తీసుకుందని సమాచారం. అంతేకాకుండా మహేష్ బాబు ఈ సినిమా లుక్ కోసం నాలుగు నెలలు టైం తీసుకోవడం జరిగిందట. ఇక అందుకే షూటింగ్ కాస్త లేట్ గా స్టార్ట్ చేశారంట.

ఈ సినిమాలో నాజర్ పాత్రకు మొదట ప్రకాష్ రాజ్ ను తీసుకోగా కొంత పార్ట్ షూటింగ్ తర్వాత కొన్ని అనివార్య కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో లాస్ట్ లో నాజర్ ని పెట్టి రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. ఇకపోతే క్లైమాక్స్ లో చిన్న పాపని చంపేసే సీన్ మొదట కథలో లేదని.. ఆ తరువాత ఆ పాపని చంపినట్టు చూపించడంతో ఈ సినిమాకి చాలా మైనస్ అయిందని అప్పట్లో కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ సినిమాకి మొదట రూ.25 కోట్లు బడ్జెట్ అనుకున్నారు కానీ, ఫైనల్ గా 30 కోట్లు అయ్యిందట.

అయితే ఈ సినిమా రిలీజ్ అయి మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ మూట కట్టుకున్నప్పటికీ కూడా ప్రిన్స్ మహేష్ మూవీ కాబట్టి మొదటివారం ఓపెనింగ్ వరకు ఓకే అనిపించింది. అయినప్పటికీ ఈ సినిమాకి పోటీగా చిరుత, హ్యాపీడేస్, తులసి వంటి సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో కొన్ని ఏరియాల్లో బయ్యర్స్ బాగా నష్టపోయారు. అయినప్పటికీ 20% వరకు నిర్మాత సర్దుబాటు చేశారట. అతిధి సినిమా తర్వాత కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ గాని రమేష్ బాబు కానీ మరో సినిమాను నిర్మించడం జరగలేదు. కానీ `దూకుడు` మరియు `ఆగడు` సినిమాలకు మాత్రం సమర్పకులుగా వ్యవహరించడం జరిగింది.

https://twitter.com/ssmb_freaks/status/1582422837956325376?s=20&t=oDw1iv5pFtnWFY1cjqx-1A