పెళ్లైన ఆ ముగ్గురు హీరోల‌పై క‌న్నేసిన ర‌ష్మిక‌.. ఛీ.. ఛీ.. ఇదేం అరాచ‌కం!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న ఈ భామ` పుష్పా` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.

ఇకపోతే ఈమె తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. అక్టోబర్ 7న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో రష్మిక ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

ఈ క్రమంలోనే ఆమెకు మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలని కోరుకుంటున్నారు? అనే ప్రశ్న ఎదురయింది. అందుకు రష్మిక బదులిస్తూ అల్లు అర్జున్, రణబీర్ కపూర్, విజయ్ ద‌ళపతి పేర్లను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలతో రష్మిక సినిమాలు చేస్తుంది. అందు కారణంగానే ఆ ముగ్గురు హీరోల పేర్లు చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

అయితే రష్మిక కామెంట్స్ పై కొందరు నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన హీరోలు నీ స్వయంవరంలో పాల్గొనాలని కోరుకుంటున్నావా…ఛీ.. ఛీ.. ఎంత అరాచకం అంటూ నేటిజన్లు రష్మికను తప్పు పడుతూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆమె సరదాగా ఆ హీరోల పేర్లు చెప్పిందని రష్మిక కు సపోర్ట్ గా నిలుస్తున్న వారు లేకపోలేదు.