పెళ్లి కాకుండానే తల్లి అయిన పూర్ణ.. ఆ భయంతోనే ఇలా చేసిందా?

పూర్ణ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఓవైపు వివిధ టీవీ షోల్లో జడ్జ్ గా చేస్తూ మరియు అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా `ఢీ జోడి` లో జడ్జిగా పూర్ణ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య సినిమా `అఖండలో` పూర్ణ మెరిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్ణకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన పూర్ణ ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. అదేమిటంటే పూర్ణా మ్యారేజ్ ఎప్పుడో జరిగిపోయింది అంటూ అధికారికంగా ప్రకటించింది. పూర్ణ దుబాయ్ స్టార్ బిజినెస్ మ్యాన్ షనీద్ అసిఫ్ అలీ తో మే లో నిశ్చితార్థం చేసుకుని జూన్ లో పెళ్లి చేసుకుందట. అయితే ఆమె పెళ్లి విషయం అభిమానులందరికీ లేట్ గా చెప్పగా ఇది విన్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నామని.. త్వరలోనే సెలబ్రిటీస్ కి, ఫ్రెండ్స్ కి కేరళలో ఒక పెద్ద రిసెప్షన్ ఇస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే పూర్ణ పెళ్లి జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ చెప్పకుండా ఇప్పుడు చెప్పడం వెనుక ఏదో పెద్ద రీజన్ ఉందనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే పూర్ణ ఇప్పుడు తల్లి కాబోతుందట. అవును ఇది నిజమే వస్తున్న వార్తలు ప్రకారం పూర్ణ తల్లి కాబోతుందని అందుకనే తన పెళ్లి విషయాన్ని ఫోటోలు తో సహా అధికారికంగా చెప్పింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి పూర్ణా తన పెళ్లి విషయం కొన్ని రోజులు తర్వాత చెబుదామనుకుందట కానీ ఈ క్రమంలోనే ఆమె తల్లి కాబోతుందని తెలియడంతో ఒకవేళ బేబీ బంప్ బయటకు కనిపిస్తే పెళ్లి కాకుండానే తల్లి అయిందంటూ మీడియాలో నానా రచ్చ చేస్తారని ఉద్దేశంతో ముందుగానే తనకు పెళ్లయింది అనే విషయాన్ని బయటకు వెల్లడించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పూర్ణ పెళ్లి కాకుండానే తల్లి అయిందంటూ వార్తలు వ‌స్తాయ‌నీ.. ఇక ఆ భయంతోనే తనకు పెళ్ళై చాలా రోజులవుతుందని ప్రకటించినదని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పూర్ణ మ్యారేజ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.