ఆ చెడు వ్యసనాల వల్లే ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత కెరీర్ నాశనమైందా?

రస్నా బ్యూటీ అయిన అంకిత ఝవేరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అంకిత ముంబైలో పుట్టి పెరిగి, చదువును కూడా అక్కడే పూర్తిచేసి.. ఎవరు ఊహించిన విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి చిన్నచిన్న యాడ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత వై.వి.ఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాలో హీరోయిన్గా చేసి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత “ప్రేమలో పావనికళ్యాణ్” అనే సినిమాలో అంకిత తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. దాంతో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసున ‘సింహాద్రి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. “సింహాద్రి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అంకిత పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. అందుచేత ఈమెకు వరుసుగా మంచి అవకాశాలు వచ్చాయి.

కాకపోతే అంకిత తన తల పొగరు కారణంగా కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయడం.. మరికొన్ని చెత్త సినిమాలు చేయడం వల్ల సినీ ఇండస్ట్రీలో వెనుకబడిపోయింది. ఒక్కసారిగా సినీ అవకాశాలు రాకపోవడంతో క్రమక్రమంగా చెడు అలవాట్లకు బానిస అయిందట. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు బానిసైన అంకిత రాత్రిపూట మూడు పెగ్గులు వేస్తే తప్ప నిద్రపోయేది కాదట. ఆ మధ్యపానం మత్తులో ఏం అడుగుతుందో? ఏం చేస్తుందో? కూడా అర్థం కావడం లేదని తన సన్నిహితులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చెడు అలవాట్లకు బానిసైన అంకితను చూసి ఆమె తల్లిదండ్రులు అంకితను రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా చేర్పించారు. ఆ చెడు వ్యసనాల వల్లే ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత తన కెరీర్ ను నాశనం చేసుకుందంటూ సమాచారం. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఖాళీ సమయంలో ఆరేళ్లపాటు లండన్ వెళ్లి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లమా పొందింది. అయినప్పటికీ అవకాశాలేమీ రావకపోవడంతో బిజినెస్ మాన్ లో పెళ్లాడి విదేశాల్లో సెటిలైంది.