చిరంజీవి హిట్ డైరెక్టర్ తో మహేష్ బాబు.. ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్..!?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు.

అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నాడు. అయితే కారణమేమిటో గాని అటు పై మోహన్ రాజా తెలుగులో ఇక సినిమాలు చేయలేదు. అసలు సంగతి ఏమిటంటే నిజానికి మోహన్ రాజా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వవలసి ఉంది. అయితే ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ సహాయంతో మహేష్ బాబుకి ఒక స్టోరీని కూడా వినిపించారట మోహన్ రాజా.

ఈ క్రమంలోనే `గాడ్ ఫాదర్` రీమేక్ బాధ్యతను ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్.. మోహన్ రాజా కు అప్పగించడం దానికి చిరు ఓకే చెప్పడం జరిగింది. ఇకపోతే మహేష్ బాబును డైరెక్ట్ చేయాల్సిన మోహన్ రాజా చిరంజీవితో `గాడ్ ఫాదర్` సినిమాను డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే త్వరలోనే మోహన్ రాజా మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా వస్తుందని అంటున్నారు. ఇది ఒక రకంగా ఫ్యాన్స్ కు పూనకాళ్లు తెప్పించే అప్ డేట్ అనే చెప్పాలి.

Share post:

Latest