ఫర్ ది ఫస్ట్ టైం ఇలా..బాలయ్య కోసం అనిల్ రావిపూడి సంచలన నిర్ణయం..!?

నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండ్రి, కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని.. ఆల్రెడీ అనిల్ రావిపూడి వెల్లడించారు.

దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా విషయంలో అనిల్ రావిపూడి ఓ సంచల నిర్ణయం తీసుకున్నారట. ఎన్ బి కే 108 షూటింగ్ను మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆయన నిర్ణయించారట. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొదిద్దుకుంటున్న ఈ చిత్రం దాదాపు చివరి దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి, బాలయ్య సినిమా పట్టాలెక్కనుందట. నవంబర్ 2 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక షూటింగ్ స్టార్ట్ అయినాక ఎలాంటి బ్రేకులు లేకుండా మూడు నెలల్లో ముగించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. వాస్తవానికి అనిల్ రావిపూడి కెరీర్ లో ఏ సినిమాను ఇంత త్వరగా పూర్తి చేసింది లేదు. ఫుర్ ది ఫస్ట్ టైం బాలయ్య సినిమాను సూపర్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో లేదా మే నెలలో విడుదల చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Share post:

Latest