మెగా 154 సినిమా నుండి అదిరిపోయే న్యూస్.. మెగా అభిమానులకు పూనకాలే..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ వీడియోకు అభిమానుల నుండి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది.

Mega 154: Chiranjeevi And Bobby's Movie Title Will Be Unveiled On This Date

ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చిన మరో అప్డేట్ ఏమిటంటే. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక ట్రాక్ ను డైరెక్టర్ డిజైన్ చేశారట. ఈ సినిమాలో చిరంజీవి- రవితేజ వరుసకు అన్నదమ్ముల పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయట.. ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా చిరు- రవితేజ మధ్య నడిచే సంభాషణలు ఎంతో అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది.