ఖడ్గం బ్యూటీ కిమ్ శర్మ ఎంత మందితో ఎఫైర్స్ నడిపించిందో తెలిస్తే షాకే!?

కిమ్ శర్మ.. `ఖడ్గం` సినిమాలో “ముసుగు వెయ్యొద్దు మనసు మీద“ అనే ఐటెం పాటతో తెలుగు ప్రేక్షకుల మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.2002లో దర్శకుడు కృష్ణవంశీ తరికెక్కించిన `ఖడ్గం` సినిమాలో ఆమె నటించింది. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన `మగధీర` సినిమాలో ‘చెప్పానే చెప్పద్దు వంకా’ అనే ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇక కిమ్ శర్మ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి 2010లో కన్యా దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ అయినా అలీ పుంజి అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుని ఇండియా వదిలి వెళ్ళిపోయింది.

అయితే ఐదేళ్లు గడిచాక తనను భర్త వేధిస్తున్నాడంటూ అనేక ఆరోపణలు చేసి అదే ఆరోపణలతో కోర్టుకెక్కి 2016లో విడాకులు తీసుకుంది. అయితే కిమ్ శర్మ అలీ పుంజిని పెళ్లి చేసుకున్నది అతని యొక్క ఆస్తిని చూసి అంతేకానీ.. తన మీద ప్రేమతో కాదని అప్పట్లో అందరూ భావించారు.అయితే కిమ్ పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కొంతమందితో ప్రేమాయణం నడిపింది. కానీ వాటిలో ఏవి కూడా పెళ్లి పీటలు లెక్క లేకపోయాయి. ఆమె ప్రేమాయణం నడిపిన ఆ స్టార్స్ ఎవరో మనం తెలుసుకుందాం..

యువరాజ్ సింగ్.. కిమ్ శర్మ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే యువరాజ్ సింగ్ తో కొంతకాలం డేటింగ్ చేసిన టైంలో వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరిగారు. అయితే యువరాజ్ సింగ్ తల్లికి కిమ్ శర్మ పై మంచి అభిప్రాయం లేకపోవడంతో వీరి డేటింగ్ కాస్త రిలేషన్షిప్ గా మారక ముందే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగిపోయింది.

హర్షవర్ధన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ నటిస్తూ చిన్న సినిమాలకు హీరోగా కొనసాగిస్తున్నాడు. తెలుగులో `అవును`, `మాయ` వంటి పలు చిత్రాల్లో నటించాడు. అయితే హర్షవర్ధన్ తో కిమ్ కొన్నాళ్లపాటు ప్రేమాయణం సాగించి కొంతకాలం డేటింగ్ లో కూడా ఉన్నారు. అంతా బావుంది అనే టైంలో కారణాలు ఏంటో తెలియదు కానీ కొన్నాళ్లకే వీరు విడిపోవడం జరిగింది.

లియాండర్ పేస్… ప్రస్తుతం టెన్నిస్ దిగ్గజం అయినా లియాండర్ పేస్ తో కిమ్ గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునికి తేలుతూ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అయితే ఫేస్ తన భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటున్నాడు. అయితే కిమ్ పై మోజుతోనే తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు మీడియాలో మాత్రం గ‌ట్టిగా వినిపిస్తున్నాయి.