చిరంజీవి మరో యాక్షన్ సినిమాపై తన మనస్సు పడేసుకున్నాడా.. అసలు విషయం ఏమిటంటే..!

చిరంజీవి ఆచార్య సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నాడని చెప్పాలి. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు సమయం తీసుకుని విభిన్నమైన కథలతో వరుస సినిమాలలో చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అయ‌న‌ నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన తర్వాతి సినిమాలు కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నాయి.

Godfather Teaser: Chiranjeevi Arrives In Style And Is All Set To Change The  Political Game

ఈ క్రమంలోనే చిరంజీవి మరో భారీ సినిమాను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ నీ మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కి రీమేక్ గా తీస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు చిరంజీవి హౌస్ స్పానిష్ త్రిల్లర్ ను రీమేక్ చేస్తున్నారనె వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి మొదటిసారిగా ఓ డాన్ పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. స్పానిష్ లో ఆ కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ స్టోరీ న‌చ్చ‌టంతో చిరంజీవి ఈ కథకు ఓకే చెప్పినట్టు టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇంకా అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అందరిచూపు చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గాడ్‌ ఫాదర్ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెర్కెక్కించాడు. అయితే ఈ సినిమా నుండి ఇటు వరకు వచ్చిన ప్రతి టీజ‌ర్ ,సాంగ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా ఎప్పుడు విడుదలవుతుందని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో హిట్అందుకుంటారో లేదో చూడాలి.