‘గాడ్ ఫాదర్’ థియేట్రికల్ బిజినెస్ అన్ని కోట్లా… చిరుకు బ్రేక్ ఈవెన్ అయ్యేనా ?

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి సినిమా వస్తుందంటేనే ఆయన అభిమానులకు అది పండుగలాగా ఉంటుంది. చిరు కొత్త సినిమా గాడ్ ఫాద‌ర్ ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరీ జగన్నాథ్ కీలక పాత్రల‌లో నటించారు. ‘

Thaar Maar Thakkar Maar (From "God Father") - song and lyrics by Thaman S,  Shreya Ghoshal, Chiranjeevi, Salman Khan | Spotify

ఆచార్య ప్లాప్ అయినా గాడ్ ఫాదర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఎవరు ఊహించని విధంగా జ‌రిగింది. గాడ్ ఫాదర్ థియేట్రికల్ రైట్స్ నైజాంలో 22 కోట్లకు అమ్ముడుపోయింది. సీడెడ్ లో ఏకంగా 13 కోట్లకు అమ్ముడు పోగా, ఆంధ్రా లో ఈ సినిమా ఏకంగా 35 కోట్లకు అమ్ముడుపోయింది. గాడ్ ఫాదర్ తెలుగు రాష్ట్రాలలోనే ఏకంగా 70.50 కోట్లుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.

Chiranjeevi is all swag in Godfather first-look poster

ఓవర్సీస్ లో కూడా గాడ్ ఫాదర్ 7.5 కోట్లకు…ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, హిందీ బెల్ట్ రాష్ట్రాలలో ఈ సినిమాను 6.50 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా 90 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది అనేది చూడాలి.