చిరంజీవిని అల్లుడు గా చేసుకోవడం వెనక ఇంత కధ ఉందా.. అల్లు రామలింగయ్య భారీ స్కెచ్ వేసాడుగా..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో హిట్ సినిమాలను టాలీవుడ్ కి ఇచ్చాడు. ఆయన నిత్యం ఏదో ఒక సినిమాతో బిజీగానే ఉంటూ తొలిసారిగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా షోలో పాల్గొనటం ఇలా మొదటిసారి.. ఈ టాక్ షోలో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను ఆలీతో పంచుకున్నాడు. ప్రధానంగా చిరంజీవితో తనకున్న అనుబంధం, చిరంజీవికి తన చెల్లి సురేఖను ఇచ్చి పెళ్లి ఎలా చేశారనేది.. ఈ కార్యక్రమంలో చెప్పుకోవచ్చాడు.

Allu Aravind Should Take 50% Credit of Chiranjeevi's Success

చిరంజీవిని నేను మొదటిసారిగా చలసాని గోపి ఆఫీసులో కలిశాను.. అక్కడ నాకు చిరంజీవి తో పరిచయం ఏర్పడింది.. అక్కడ ఇద్దరం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాం.. అప్పుడు కలుసుకున్న మేము ఇప్పటివరకు ఇలా ఉంటామని అనుకోలేదు. చిరంజీవి మా ఇంటికి అల్లుడు కావడానికి ముఖ్య కారణం మా అమ్మ. ఆ టైంలో మా ఇంటి పైన సత్యనారాయణ అనే ఒకాయన ఉండేవారు. ఏదో ఒక టైం లో చిరంజీవి ఆయనని కలవడానికి మా ఇంటికి వచ్చాడు.. ఆ టైంలో చిరంజీవిని చూసిన మా అమ్మ ఆ వ్యక్తి ఎవరు అని సత్యనారాయణ అని అడిగితే.. అతను చిరంజీవి అని చెప్పాడు.. అప్పుడే మా అమ్మ అతను మన వాడేనా అని అడగడం.. ఆ రాత్రి నన్ను నిద్ర పోనివ్వలేదు.

Pic Talk: Chiranjeevi Wedding Unseen Photo | cinejosh.com

చిరంజీవి గురించి చెప్పటమే… ఈ విషయాన్ని మా నాన్న అంతగా పట్టించుకోలేదు.. అయినా మా అమ్మ వినకుండా చిరంజీవి గురించి రోజు మాట్లాడుతూనే ఉండేది. ఆ తర్వాత మా నాన్న మన ఊరి పాండవుల సినిమా కోసం చిరంజీవి 20 రోజులు రాజమండ్రిలో ఉన్నాడు. ఆ సందర్భంలో చిరంజీవిపై నాన్న సిఐడి పనిచేయటం మొదలుపెట్టాడు. ఈ విషయం ఇప్పటివరకు చిరంజీవికి కూడా తెలియదు. ఆయన మంచివారిని తెలుసుకున్న మా నాన్న చిరంజీవికి మా చెల్లిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా చిరంజీవి మా ఇంటి అల్లుడయ్యాడు. అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.