సమ్మర్ టార్గెట్ గా.. బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా..!

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన కెరియర్ లోనే ఎప్పుడూ లేనంతగా జెట్ స్పీడ్ లో వరుస‌ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు తన 107వ సినిమాలో గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి లేదా క్రిస్మస్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ మొదటిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సీజన్ కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఈ నెల 14న ఆహాలు స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ బాలయ్య తన ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తన 108వ సినిమాను కూడా ఈ సంవత్సరమే పట్టాలెక్కించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట.

Anil Ravipudi and Nandamuri Balakrishna's NBK 108 first look is out

ఇక తన 108వ సినిమాను కేవలం నాలుగు నెలల లోనే పూర్తి చేసి సమ్మర్ కి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమాను నవంబర్‌లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి బాలయ్యకు హిట్ ఇస్తాడో లేదో అనేది తెలియాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.