టాలీవుడ్ క్రేజీ నటుడిగా జగపతిబాబు.. చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. జగపతిబాబు హీరోగా వచ్చిన క్రేజ్ కంటే విలన్ గా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. బాలకృష్ణ “లెజెండ్“ సినిమాతో తన కొత్త కోణాన్ని చూపించిన జగపతిబాబు.. ప్రస్తుతం స్టైలిష్ అండ్ డైనమిక్ విలన్ గా కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఆ తరువాత `రంగస్థలం`, `అరవింద సమేత` సినిమాలో కూడా విలన్ గా చేసి అందర్నీ తన నటనతో మెప్పించాడు.
ప్రస్తుతం జగపతిబాబు `సలార్` వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అయితే ఈయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా స్పందిస్తూ ఉంటారు. అయితే ఆయన ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ.. దాని కింద కొటేషన్లు షేర్ చేస్తూ.. వేదాంతలు వల్లిస్తూ ఉంటాడు. అలా తాజాగా జగపతిబాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అదేమిటంటే తలకిందులుగా వేలాడుతున్న జగపతిబాబు ఫోటో అలాగే దాని కింద క్యాప్షన్ అందర్నీ ఆకర్షిస్తుంది. “ప్రపంచాన్ని ఇలా చూస్తే అయినా అర్థమవుతుందేమో? అని ఇలా ట్రై చేస్తున్నాను“ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసినా ప్రేక్షకులు ఆరు పదుల వయసులో జగపతిబాబు విన్యాసాలు.. వామ్మో ఏంటి సామీ ఇది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ జగపతిబాబు మాత్రం ప్రస్తుతం కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీ స్టార్ గా మారిపోయాడు.
ila aina ee lokam ardham avutundhemo ani choosthunna. pic.twitter.com/f2jOte3QGl
— Jaggu Bhai (@IamJagguBhai) October 18, 2022