ఔను.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పడం కష్టం. పంచదార చుట్టూ.. చీమలు చేరినట్టు గా ఎక్కడ అవకాశం ఉంటే.. ఎక్కడ అధికారం దక్కుతుందని నాయకులు భావిస్తే.. ఆ పంచకు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జరుగుతోంది. వచ్చే ఎన్నికల విషయంలో ఎవరు ఎవరితో కలుస్తారు? అనే విషయంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయినప్పటికీ.. అధికార పార్టీలోని కొందరు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి నాయకులు ఉన్నారు.
ఒక్కొక్క నియోజకవర్గంలో ఆశావహులు మరింత ఎక్కువ మంది ఉన్నారు. దీంతో తమకు ఛాన్స్ దక్కదని ముందుగానే లెక్కలు వేసుకుంటున్న నాయకులు జంపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అదేసమయంలో తమకు టికెట్ దక్కేలా లేదని.. భావిస్తున్నవారు. అసంతృప్తులు సైతం ఇలానే వ్యవహరిస్తున్నారు. ఇక్కడ వైసీపీ నేతలకు కలిసి వస్తున్న అంశం ఏంటంటే.. జనసేనలో నాయకులు లేకపోవడమే. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన అందరూ ఓడిపోయారు. ఒక్క రాజోలులో తప్ప!
అలా ఓడిపోయిన వారు ఎవరూ కూడా పార్టీలో లేరు. పైగా వచ్చే ఎన్నికల నాటికి వస్తారో రారో యాక్టివ్ అవుతారో .. అవరో కూడా తెలియని పరిస్థితి. దీంతో ముందుగానే.. అధికార పార్టీ అసంతృప్త నేతలు. తాము జనసేనలోకి వెళ్తే.. టికెట్ ఖాయమని అనుకుంటున్న వారు.. ఫ్యానుకు దూరమై.. గ్లాసుకు దగ్గరవుతున్నారు. ఇక్కడ మరో చిత్రం ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ.. ప్రజల్లో జనసేనాని పవన్‌కు వస్తున్న పాజిటివ్ ఫీడ్ వారిని ఆదిశగా అడుగులు వేయిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు పొత్తు కనుక ఖరారైతే.. వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, ఇప్పటి వరకు గుడివాడలో పాలంకి బ్రదర్స్, రాజోలులో బొంతు రాజేశ్వరరావు, తెనాలిలో శివరామిరె డ్డి తదితరులు జనసేన కండువా కప్పుకొన్నారు. వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్‌ను ఆశిస్తున్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ ఉన్నారనే టాక్ జోరుగా సాగుతోంది. దీనికితోడు.. జనసేనను అధికారంలోకి తీసుకువస్తానని.. పవన్ కూడా పదే పదే చెబుతున్నారు. ఈ .పరిణామాలతో జనసేనపై నాయకులకు అంచనాలు పెరుగుతున్నాయి. దీంతోనే వైసీపీ నుంచి నాయకులు.. జనసేన దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.