హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ బీహేవియర్.. కృష్ణ ముందే అలా..!? !

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. `పెళ్లి చూపులు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక విజయ్ `అర్జున్ రెడ్డి` సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మారిపోయాడు.

అయితే ఇటీవల విజయ్ దేవరకొండ `లైగర్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. `లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా విజయ్ మారిపోయాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయి విజయ ఆశలపై ఇటు అభిమానుల ఆశలపై నీరు చల్లింది. అయితే `లైగర్` సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా హిట్ అవుతుంది అని నమ్మకంతో మాట్లాడిన వీరు సినిమా రిలీజ్ తర్వాత సినిమా టీం సోషల్ మీడియాలో కనిపించడమే మానేశారు. ఇక అంతేకాకుండా బాలీవుడ్ లో అయితే `లైగర్` సినిమాపై బాయ్ కట్ హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ అయింది.

అయితే విజయ్ దేవరకొండ పై ఈ సినిమా ప్రమోషన్ సమయంలో విమర్శికులు వెల్లువెత్తిన కూడా పట్టించుకోలేదు. ఇక విజయ్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు.. అంటూ అతనిపై పలువురు విమర్శలు కూడా వచ్చాయి. ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కన్నతల్లి అయినా ఇందిరా దేవి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందిరా దేవిని కడసారి చూడడం కోసం భారీగా అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా వారి నివాసానికి తరలివచ్చారు. మహేష్ బాబును ఓదార్చి ఇందిరాదేవి పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు.

 

ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ కూడా అక్కడికి వెళ్లి ఇందిరా దేవి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆ తరువాత మహేష్ ని ఓదార్చి పక్కనే ఉన్న సూపర్ స్టార్ కృష్ణని సైతం పలకరించాడు. అలా అక్కడ విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరు అందరిని కట్టిపడేసింది. అయితే కృష్ణ సోఫాలో కూర్చుని బాధపడుతుండగా విజయ్ వెళ్లి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని చేయ‌పట్టుకుని ఓదార్చిన తీరు, పద్ధతి అందరిని అబ్బురపరిచింది. ఇక విజయ్ అభిమానులు అయితే ఇతనికా ఆటిట్యూడ్ అని అందరూ ట్రోల్ చేశారు? అంటూ ఈ ఫోటోని షేర్ చేసి.. మా అన్న అంటూ విజయ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇక అలా విజయ్ దేవరకొండ బిహేవియర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.