చిన్న సంతకంతో.. కోట్లు పోగొట్టుకున్న రేసుగుర్రం విలన్..?

ఇటీవల నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు. అయితే మోసపోయే వాళ్ళు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటారన్నది నిజమే కాబోలు. అలాగే సినిమా వాళ్లు కూడా మోసం చేయడమో.. మోసపోవడం జరుగుతూ నే ఉంటుంది. అయితే రీసెంట్ గా `రేసుగుర్రం` విలన్ రవి కిషన్ తన స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అది కూడా కొన్ని కోట్ల డబ్బుని కోల్పోయాడు.

`రేసుగుర్రం` సినిమాతో భారీ పాపులారిటీని సంపాదించుకున్న రవి కిషన్.. ప్రస్తుతం బిజెపి నుంచి ఎంపీగా ఉన్నాడు. ఇటీవలే ఆయన తన స్నేహితుడు చేతిలో మోసపోయినట్లు తన స్నేహితుడి పై కంప్లైంట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే గోరక్ పూర్ ఎంపిగా ఉన్న రవి కిషన్ 2012లో తన స్నేహితుడికి ఇంచుమించు 10 ఏళ్ల క్రిందట మూడు కోట్లు అప్పుగా ఇచ్చాడట.

ఇక రవికిషన్ స్నేహితుడు ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన జైన్ జితేంద్ర రమేష్ ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో భాగంగా రవికిషన్కు 34 లక్షల చొప్పున 12 చెక్కులను ఇవ్వడం జరిగిందట. అయితే ఆ చెక్కుల్లో ఓ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేయగా ఆ చెక్ బౌన్స్ అయిందట. ఆ తరువాత తన స్నేహితుడు జితేంద్ర రమేష్ కు ఫోన్ చేసిన సరేనా రెస్పాన్స్ రాకపోవడంతో విసిగిపోయిన రవికిషన్.. జితేంద్ర నుంచి సమాధానం సరిగా లేకపోవడంతో గోరఖ్ పూర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కంప్లైంట్ చేశాడట.

అయితే ఈ విషయాన్ని రవి కిషన్ పీఆర్ ఓ పవన్ ధూబే తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంటోన్మెంట్ పీఎస్ ఇన్చార్జ్ శశిభూషణ్ కూడా ప్రకటించారు. ఇక భోజ్ పూరి సూపర్ హీరోగా ఉన్న రవి కిషన్ టాలీవుడ్ లో రేసుగుర్రం సినిమాతో పెద్ద స్టార్ అయ్యాడు. ఇక ఆ తరువాత రవికిషన్ వరుసుగా సైరా నరసింహారెడ్డి, MLA , సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయకుడు, లై, రాధా, సుప్రీమ్, కిక్క్-2 లాంటి తెలుగు సినిమాల్లో నటించాడు. రవి కిషన్ భోజ్ పూరి తో పాటు హిందీ, కన్నడ , తెలుగు భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.