పొన్నియన్ సెల్వన్ సినిమాకి కళ్ళు చెదిరే పారితోషకాలు.. హైయెస్ట్ ఆయనకి..లీస్ట్ ఆమెకి..?

తమిళ్ జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లో రాబోతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం కోట్లు ఖర్చు చేసి కోట్ల ఆస్తిని పెట్టుబడులుగా పెట్టి అంతకన్నా ఎక్కువైనా తన కష్టాన్ని ధారపోసి తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ సినిమా. ఈ సినిమా మరికొద్ది గంటల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దాదాపు రెండేళ్లు షూటింగ్ చేసుకున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కినట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా స్టార్టింగ్ లోనే ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తామని అఫీషియల్ గానే చెప్పాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు పోనియన్ సెల్వన్ పార్ట్ వన్ విడుదలకు రెడీగా ఉంది . మరికొద్ది గంటల్లోనే మొదటి బొమ్మ పడబోతుంది. అయితే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తమిళ్ జనాలు ఈ సినిమాను తమిళనాడు బాహుబలి అంటూ రేంజ్ లో పాపులర్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే నాలుగు గంటల షో టికెట్లు అన్ని హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి నిజానికి ఈ సినిమా పై తెలుగులో కూడా బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజులనాటి కథ కావడం పైగా బాహుబలి రేంజ్ లో రెండు భాగాలుగా తెరకెక్కడం తో ఈ కథపై బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు జనాలు.

అయితే ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ భారీ తారగాణం. ఈ సినిమాలో మల్టీ టాలెంటెడ్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి ,కార్తీ త్రిష, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు ,శోభిత ధూళిపాల, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లాంటి బిగ్ బిగ్ స్టార్స్ అందరూ మెయిన్ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం . కాగా ఇంతమంది భారీ తారగాణంతో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అదే ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ డీటెయిల్స్

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా విక్రమ్ 17 కోట్లు చార్జ్ చేస్తే.. అందరికన్నా లీస్ట్ తీసుకున్న హీరోయిన్ గా శోభిత ధూళిపాల కేవలం కోటి రూపాయల పారితోషికంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది . అంతేకాదు ఈ సినిమా కోసం మిగతా హీరో హీరోయిన్స్ ఎంతెంత పారితోషకాలు తీసుకున్నారో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం.. విక్రమ్ 17 కోట్లు, ఐశ్వర్యరాయ్ 15 కోట్లు ,జయం రవి 10 కోట్లు, కార్తీ 7 కోట్లు, త్రిష రెండు కోట్ల 50 లక్షలు, ఐశ్వర్య లక్ష్మి కోటి 50 లక్షలు ,ప్రభువు కోటి 25 లక్షలు, శోభిత ధూళిపాల కోటి ,ప్రకాష్ రాజ్ కోటి, శరత్ కుమార్ కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఇక్కడికే 50 కోట్లకు పైగా క్యాస్టింగ్ కి ఖర్చయినట్లు తెలుస్తుంది . మరి చూడాలి ఈ సినిమా కోసం ఇంత ఖర్చుపెట్టిన మణిరత్నం ఎలాంటి లాభాలు అందుకుంటాడో..?