ఖడ్గం సినిమాలో ఆ సీన్ నిజంగానే జరిగిందా..? కృష్ణవంశీ ని కన్నీరు పెట్టించిన హీరోయిన్ ఓరిజినల్ స్టోరీ..?

డైరెక్టర్ కృష్ణవంశీ అంటే ప్రేక్షకులకి సుపరిచితమైన పేరే. ఇక ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అలా అద్భుతమైన సినిమాలలో ఓ అద్భుతం ఖడ్గం. ఇక ఈ సినిమాలో ముస్లిం, హిందువుల మధ్య స్నేహబంధం ఎలా ఉంటుందో కళ్లకు కట్టిన్నట్లు చూపించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని ..బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది.

అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే, కిమ్ శర్మ వారితోపాటు తెలుగు హీరోయిన్ సంగీత ..వీరు ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో సంగీత రోల్ చాలా మంది హీరోయిన్స్ కి కనెక్ట్ అయ్యింది. సినిమా ఛాన్స్ కోసం పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చిన ఓ అమ్మాయిని..డైరెక్టర్స్ ఎలా వాడుకుంటారో అనే పాత్రలో నటించి మెప్పించింది. సినిమాలో సంగీత ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్… అంటూ అందరి మనసులని దోచేసింది.

ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. ఓ డైరెక్టర్ సినిమాలో సంగీతాను హీరోయిన్ చేస్తానంటూ నమ్మించి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళె సీన్..హా గుర్తు వచ్చిందా…నిజానికి ఈ సీన్ ను డైరెక్టర్ కృష్ణవంశీ తన భార్య రమ్య కృష్ణ పడిన బాధలు చూసి తెరకెక్కించారట. కేవలం రమ్య కృష్ణ నే కాదు.. సినిమా రంగంలో హీరోయిన్ లకు అప్పట్లో ఇలాంటి పరిస్థితులే ఉండేవట. ఇక కృష్ణవంశీ ఆ ఉద్దేశంతోనే ఖడ్గం సినిమాలో ఆ సన్నివేశాన్ని పెట్టాడట. తన భార్య రమ్యకృష్ణని కూడా ఓ స్టార్ డైరెక్టర్ షూటింగ్ టైంలో ఇబ్బంది పెట్టిన తరుణంలో డైరెక్టర్ కృష్ణవంశీ కావాలని ఆ డైరెక్టర్ ని దృష్టిలో పెట్టుకుని ఖడ్గం సినిమాలో ఈ సీన్ పెట్టారని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుసగుసలు వినిపించాయి.

 

 

Share post:

Latest