నాగచైతన్యకు భారీ బొక్కా..ఆ సినిమా నుండి ఔట్..!?

జోష్ అనే సినిమాతో జోష్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన నాగచైతన్య.. సినిమాల విషయంలో మాత్రం ఆ జోష్ చూపించలేకపోయాడు. జోష్ సినిమా యావరేజ్ గా మిగిలిన ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ ని కొట్టాయి. అయితే ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన బంగార్రాజు.. సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అక్కినేని నాగచైతన్య.. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి.

థాంక్యూ సినిమా ఘోరమైన కలెక్షన్లు సాధించి చెత్త రికార్డును నెలకొల్పింది . ఆ తర్వాత వచ్చిన “లాల్ సింగ్ చద్దా అయితే ” సినిమా గురించి అయితే చెప్పనే అవసరం లేదు. టాలీవుడ్ లో చాలామంది ఈ సినిమాను చూడను కూడా చూడలేదు అంత దరిద్రంగా ఉంది అంటూ రివ్యూ లు ఇచ్చారు జనాలు. ఇలాంటి క్రమంలో నాగచైతన్య ఆశలని తన తదుపరి సినిమా పైనే పెట్టుకొని ఉన్నాడు.
నాగచైతన్య తన తదుపరి సినిమాను దర్శకుడు వెంకట ప్రభుతో అనుకున్న సంగతి తెలిసిందే .

ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటించబోతుంది. అయితే ఇది కాకుండా పరశురాంతో ఓ సినిమా కమిట్ అయ్యాడు చైతు . ఈ విషయం ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ గానే ఉంది . అయితే తాజా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు నుంచి నాగచైతన్య అవుట్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి పరశురాం చెప్పిన కథ నాగచైతన్యకు బాగా నచ్చిందట. కాకపోతే నాగార్జున కొన్ని మార్పులు చేయమని చెప్పారట . దీంతో పరశురాం తన రాసుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేసి స్టోరీ వినిపించగా అయినా కూడా నాగార్జున సాటిస్ఫై అవ్వలేదట. ఈ క్రమంలోని నాగచైతన్యకు నచ్చిన స్టోరీ కూడా నాగార్జున కారణంగా ఆగిపోయినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇదే కథను పరశురాం టాలీవుడ్ లోని మరో యంగ్ హీరోకి చెప్పినట్లు ఆయన ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీంతో తండ్రి కారణంగా మంచి ప్రాజెక్ట్ మిస్ చేసుకున్నాడు నాగచైతన్య అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే అదృష్టం కన్నా దురదృష్టం నాగచైతన్యకు బాగా కలిసి వస్తుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.