‘కార్తికేయ’ డైరక్టర్ గూస్ బంప్స్ స్టోరీ.. నెక్ట్స్ ప్రాజెక్టు వరల్డ్ వైడ్ రికార్డ్..!?

ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో జనాలకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో.. ఎలాంటి సినిమాలు నచ్చవు అంచనా వేయడం చాలా కష్టమైపోతుంది . భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సాదాసీదాగా రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రం ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాస్తున్నాయి. అలా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసిన సినిమానే కార్తికేయ 2.

 

ఈ సినిమాను చందు మొండేటి అనే డైరెక్టర్ తెరకెక్కించాడు. నాగచైతన్యతో కలిసి చందు ముండేటి బోలెడన్ని ఆశలు పెట్టుకొని తీసిన సినిమా సవ్యసాచి. భారీ అంచనా నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది . దీంతో కొంత కాలం గ్యాప్ తీసుకొని కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులు ముందు వచ్చాడు. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా.. ఇండియన్ సినిమా చరిత్ర ను తిరగ రాసింది. మైండ్ బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ,కని విని ఎరుగని కంటెంట్ తో ఈ చిత్రం సూపర్ హిట్ అయింది.

మరీ ముఖ్యంగా ఎవ్వరూ ఊహించిన విధంగా కార్తికేయ 2 నార్త్ లో రికార్డులు కొల్లగొట్టింది. హిందీ వాళ్లకు ఈ సినిమా బాగా ఎక్కేసింది. దీంతో చందు మొండేటి పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. అయితే ఇప్పుడు తన తదుపరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చందు గీతా ఆర్ట్స్ కు ఓ క్రేజీ ప్రాజెక్టు విషయంలో సైన్ చేశారట. ఇది ఏకంగా పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఓ పెద్ద స్టార్ హీరోతో చేతులు కలిపి గీతా ఆర్ట్స్ ను అప్రోచ్ అయ్యి.. వరల్డ్ వైడ్ రికార్డు కొల్లగొట్టే సినిమాను తెరకెక్కించబోతునన్నట్లు తెలుస్తుంది చందు మొండేటి. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జ్రుగుతుంది అన్నట్లు తెలుస్తుంది . అంతే కాదు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతుందట . ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అల్లు అరవింద్ కి ఈ ప్రాజెక్టు చాలా నచ్చేసిందట. అందుకే సినిమా కోసం ఎంత ఖర్చయినా పర్వాలేదు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. అదే కనుక నిజమైతే ఈసారి చందు ఖాతాలో వరల్డ్ వైడ్ రికార్డు పక్కా అంటున్నారు జనాలు. మరి చూద్దాం రాబోయే కాలంలో చందు ఎలాంటి సినిమాలు తీస్తారో..?