మెగాస్టార్‌కే కండీష‌న్ల‌తో చుక్క‌లు చూపించేసిన న‌య‌న‌తార‌..!

మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్న‌ర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు.

ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి రిజెక్ట్ చేసిందంట. ఇంతకీ ఆమె ఎవరో కాదు… కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ నయనతార. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాలు చేస్తూ బిజీగా అయిపోయింది. ఇటీవల కోలీవుడ్‌ దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని మ‌రింత బిజీ అయిపోయింది.

అసలు కథ ఏంటంటే ఈ సినిమాలో చిరు చెల్లెలు క్యారెక్టర్ కోసం నయనతార‌ను తీసుకున్నారట. అయితే ఈ రోల్ చేసేందుకు నయనతార నో చెప్పేసిందట. కానీ చిరంజీవి ఫోన్ చేసి పర్సనల్ రిక్వెస్ట్ మేరకు సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. నయనతార ఈ సినిమాలో నటించేందుకు కొన్ని కండిషన్లు పెట్టిందట. అవేంటంటే అవుట్ డోర్ షూటింగ్స్ కి రాలేనని.. కాల్ షీట్స్ లిమిటెడ్ గానే ఇస్తానని.. అలాగే తాను అడిగినంత రెమ్యూనేషన్ కూడా ఇవ్వాలని.. అలా కొన్ని కండిషన్స్ పెట్టిందట.

ఈ కండిషన్లకు ఒప్పుకుంటేనే చిరంజీవి గారి సినిమాలో చేస్తానని నయనతార చెప్పిందట. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు నయనతారపై ఫైర్ అవుతున్నారు. చిరు సినిమాకు ఇన్ని కండిషన్స్ పెడతావా? అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Share post:

Latest