ఎన్టీఆర్‌, రాజ‌మౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్‌…!

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా బిజెపికి సపోర్ట్ చేస్తున్నారన్న ప్రచారం కూడా వచ్చింది.

ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ సర్కార్.. తారక్ తప్పేంటంటూ

దీనికి తోడు ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ కు పార్టీలకు అతీతంగా అందరూ అభినందనలు తెలిపారు. అయితే టిఆర్ఎస్ మాత్రం విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యత్వాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ ఈవెంట్ క్యాన్సిల్ కావడం వెనక రాజకీయపరమైన కారణాలే ఉన్నాయంటున్నారు.

Has Eros International Got SS Rajamouli On Board In Their Joint Venture  With KV Vijayendra Prasad?

అటు రాజమౌళి ఫ్యామిలీ బిజెపీకి ద‌గ్గ‌ర కావ‌డం, ఇటు జూనియ‌ర్ ఎన్టీఆర్ అమిత్ షాను క‌ల‌వ‌డం కేసీఆర్‌కు న‌చ్చ‌లేద‌ని టాక్ ? పై ఈ రెండు కారణాలతోనే కేసీఆర్ ప్రభుత్వం కావాలని బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వలేదని చాలా క్లియర్ గా తెలుస్తుంది అన్న చర్చ జరుగుతోంది. ముందు అనుమతి ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక చివరి నిమిషంలో ఈ అనుమతులు క్యాన్సిల్ చేయడంతో చిత్ర యూనిట్ కూడా మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

వినాయక చవితి ఉత్సవాలను సాకుగా చూపించారని… అయితే ముందు ఈ విషయం తెలియదా ? అని చిత్ర యూనిట్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణలో అధికారంలోకి వ‌చ్చేందుకు బిజెపి వేస్తున్న ఎత్తుల నేపథ్యంలో.. ఇప్పుడు కేసీఆర్ కూడా తన మార్కు ఎత్తులు వేస్తున్నట్టే కనిపిస్తోంది.