చీరాల‌లో ఆమంచి ప‌క్కా సేఫ్ జోన్లోనే ఉన్నాడా….!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో టైగ‌ర్ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌.. ప‌రిస్తితి ఒకింత ఇబ్బందిగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ క‌న్ప‌ర్మ్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న‌కే టికెట్ ఇస్తార‌ని అనుకుంటున్నారు. ఒత్తిడి కూడా పెంచుతున్నారు. అయినా.. ఎక్క‌డా ఆయ‌న కు అభ‌యం ద‌క్క‌లేదు.

మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. చీరాల నుంచి టీడీపీ యువ నాయ‌కుడు.. ద‌గ్గుబాటి వార‌సుడు చెంచురామ్ ను రంగంలోకి దింపుతోంద‌ని .. వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఆమంచి.. అనుచ‌రులు.. 25 మంది దాకా.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో ఆమంచికి ఉన్న టాక్ ఏంటో తెలుసుకున‌నే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు పాజిటివ్ టాకే వ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌జలు ప‌ట్టం క‌ట్టేందుకు రెడీగా ఉన్నారు.

అయితే..చెంచురామ్ మాత్రం పోటీకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌.. ఇదొక్క‌టే ఇబ్బంద‌ని తేలింద‌ట‌. కానీ,.. ఇక్క‌డ‌కూడా.. ఆమంచికి పాజిటివిటీ ఉంద‌ని.. చెబుతున్నారు. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగా చూస్తే.. ఆయ‌న గెలుపు బాగానే ఉంటుంద‌ని చెబుతున్నారు. అంటే.. వాస్త‌వానికి చెంచురామ్‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆక్వా సంస్థ‌ల్లో ఆమంచి, ద‌గ్గుబాటి ఫ్యామిలీలు భాగ‌స్వాములుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో చెంచురామ్ తొలిసారి పోటీ చేస్తుండ‌డం.. ఆమంచికి ఇబ్బందిక‌రంగా ఉంది.

కానీ, దీనికి బ‌లంగా తిప్పికొడితే.. ఆమంచికే ఫేవ‌ర్ అని అంటున్నారు. ఇప్ప‌టి నుంచి ఆయ‌న గ్రామీణ స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగితే.. ఫ‌లితం అనుకూలంగా వ‌స్తుంద‌ని కూడా చెబుతున్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి.. త‌న‌కు మార్గం సుగమం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి ఏమేర‌కు ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారో చూడాలి.