ఇందిరాదేవి సొంత ఊరు ఎక్క‌డ‌…. కృష్ణ‌తో పెళ్లి వెన‌క క‌థ ఇదే…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస మరణాల వార్త‌లు అందరిలోను కలకలలు సృష్టిస్తున్నాయి. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించి నెల రోజులు కూడా అవ్వకముందే సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మరణించడం అందర్నీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఏఐజి హాస్పిటల్ లో గత నెల రోజుల నుంచి అనారోగ్య కారణంగా చికిత్స తీసుకుంటుంది. చివరి నాలుగు రోజుల ముందు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. ఇలా ఇందిరా దేవి డిసెంబర్ 28వ తేదీ ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

ప్రతి ఒక్కరికి ఇందిరా దేవి కృష్ణ మొదటి భార్యగా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిగా.. మాత్రమే తెలుసు. కానీ ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇకపోతే ఆమె స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు. ఇక కృష్ణను పెళ్లి చేసుకున్నాక పిల్లలు రమేష్ బాబు అలాగే మహేష్ బాబులతో తరచూ ముసలిమడుగు వచ్చి వెళ్లేవారట‌. అయితే ఆమె ఎప్పుడూ వారి స్వగ్రామానికి వెళ్లిన అక్కడ అందరినీ ఆప్యాయంగా అనురాగంగా పలకరించే వారిని గ్రామస్తులు కూడా ఆమె మరణాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఇందిరా దేవి కి ముసలి మడుగులో ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఆ ఊరి పక్కనే ఉన్న లక్ష్మీపురంలో ఇందిరా దేవితో పాటు ఆమె కుమారుల, కుమార్తెల పేరిట పంట భూములు కూడా ఉన్నాయి. ఆమె పేరిట ఉన్న ఇంటి ప్రాంగ‌ణంలో భద్రాచలం వచ్చే భక్తుల కోసం వసతి గృహం నిర్మించాలని ఆమె కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. అయితే ఇందిరా దేవి ఎవరో కాదు స్వయానా కృష్ణా మేనమామ కూతురు.

కృష్ణ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యుల సూచన మేరకు ఆమెను వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆమెను వివాహం చేసుకున్న తర్వాత కృష్ణ నటించిన `గూడచారి` సినిమా రిలీజ్ అయి మంచి విజయం సొంతం చేస్తుందని అందరూ అనుకునేవారు. అయితే అప్పటినుంచి కృష్ణకు లక్కీ భార్యగా చలామణి అవుతూ ఇందిరా దేవి వచ్చారు.