సైమా అవార్డ్స్ లో అఖండ అరాచకం.. గర్జించిన బాలయ్య..!!

తెలుగు చిత్ర పరిశ్రమ క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలా వద్దా..? ధియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా..? అన్న భయంతో సినిమాలు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలోనే సీనియర్ హీరో బాలకృష్ణ తన అఖండ సినిమాతో టాలీవుడ్ కు తిరుగులేని సూపర్ హిట్‌ను అందించాడు. ఈ సినిమా ఏకంగా బాలయ్య కెరియర్ లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి. ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాని బోయపాటి శ్రీను తెరకెక్కించాడు. బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమాగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ సినిమా ధియేటర్‌లోనే ఏకంగా కరోనా సెకండ్ వేవ్‌ తరువాత 175 రోజులు ఆడింది ఇంకా ఆడుతానే ఉంది. ఈ సినిమా ఓటీటీలో కూడా సూపర్ క్రేజ్‌ను దక్కించుకుంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయిన‌ప్పుడూ భారీ వ్యూస్ ని ద‌క్కించుకుంది. టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు భారీ టిఆర్పి ని కూడా ఈ సినిమా దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా జయత్ర యాత్ర ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన సైమా( సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) లో అఖండ సినిమా ఆదరగొట్టింది. ఈ సినిమా లోని తన నటనకు గాను బాలయ్య బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించుకున్నాడు.

ఇక ఈ సినిమాలోని జై బాలయ్య పాట ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాట పాడిన గీత మాధురికి బెస్ట్ ఫిమేల్ సింగర్ గా అవార్డు కూడా వరించింది. ఈ సినిమాకి ఎంతో అద్భుతమైన విజువల్స్ ఇచ్చిన రాంప్రసాద్ కూడా బెస్ట్ సినిమా ఆటోగ్రఫీ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్స్ లో కూడా బాలయ్య తన దూకుడును ప్రదర్శిస్తూ దూసుకుపోయాడు.

Share post:

Latest